For Money

Business News

కొనసాగుతున్న పతనం

వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల జోరు పెరిగింది. నిన్న ఏమాత్రం నష్టపోని డౌజోన్స్ సూచీ ఇవాళ ఇప్పటికే 0.65 శాతం క్షీణించింది. ఇక నిన్న 1.6 శాతం క్షీణించిన నాస్‌డాక్‌ … ప్రస్తుతం 0.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న యాపిల్‌, ఇవాళ టెస్లా షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇటీవల భారీగా పెరిగిన నాస్‌డాక్‌లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. అనేక కౌంటర్లలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారు. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.63 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్ ఇవాళ మరింత బలపడి 102 స్థాయిని దాటింది. డాలర్‌ పెరిగినా.. క్రూడ్‌ మూడు శాతం పెరగడం విశేషం. బ్రెంట్ క్రూడ్‌ ఇపుడు 78 డాలర్లపైన ట్రేడవుతోంది. అయితే డాలర్‌ ప్రభావం బులియన్‌ మార్కెట్‌పై కన్పిస్తోంది. వెండి మూడు శాతం క్షీణించగా, బంగారం ధర 1 శాతంపైగా క్షీణించింది. ఔన్స్‌ బంగారం ధర 2050 డాలర్ల దిగువకు వచ్చేసింది.