For Money

Business News

నిఫ్టి కొత్త రికార్డు

అంతర్జాతీయ మార్కెట్లను మన మార్కెట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి చిన్న వార్తతో షేర్లు చెలరేగిపోతున్నాయి. ఈవీల కోసం టాటా మోటార్స్‌ ప్రత్యేక కంపెనీ పెట్టింది. ఆ మాత్రం దానికే షేర్‌ పది శాతం అప్పర్‌ సీలింగ్‌ వద్ద ట్రేడవుతోంది. రూ. 462.90 వద్ద ఉన్న ఈ షేర్‌… సీలింగ్ తరవాత ఎంత వరకు పెరుగుతుందో చూడాలి. విమానయాన రంగ షేర్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. 18,098 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 18,078 వద్ద 86 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బహుశా నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయిని తాకినట్లే. మళ్ళీ ఈ స్థాయికి వస్తే షార్ట్‌ చేయొచ్చు. మిడ్‌ సెషన్‌ తరవాత లాభాలు తగ్గే అవకాశముంది. పొజిషనల్‌ ట్రేడర్స్‌ మాత్రం నిఫ్టి పొజిషన్‌ కొనసాగించవచ్చు. నిఫ్టిలో 41 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ 0.78 శాతం పెరిగింది.