నిఫ్టి కదలిక: ఇన్వెస్టర్ల అయోమయం

గత కొన్ని రోజులుగా మార్కెట్‌ను ఊరిస్తున్న కేబినెట్ ప్యాకేజీ కూడా పూర్తయింది. టెలికాం, బ్యాంక్ షేర్లు రెండూ బాగానే పెరిగాయి. అలాగే ఆటో షేర్లు కూడా. నిన్న, ఇవాళ ఓపెనింగ్‌తో ఈ ఉత్సాహం పూర్తయింది. మరి ఇంకేమిటి? ప్రపంచ మార్కెట్లు క్షీణిస్తున్న సమయంలో నిఫ్టి ఇంకెంత వరకు వెళుతుందనే విషయమై ఇన్వెస్టర్లలో అయోమయం నెలకొంది. నిఫ్టిని ఈ స్థాయిలో అమ్మడం, లాభాలు స్వీకరించడం మంచిదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. నిఫ్టి అతి కష్టంపై 17,600 దాకా వెళ్ళొచ్చని.. ఇలాంటి స్థితిలో రిస్క్ తీసుకోవడం అనవసరమని… ఇవాళ వీక్లీ డెరివెటివ్స్ క్లోజింగ్ ఉన్నందున… ఉన్న పొజిషన్స్ అమ్మి మార్కెట్ దూరంగా ఉండటం బెటర్ అని సుదర్శన్ సుఖాని సలహా ఇచ్చారు. నిఫ్టి ఇపుడు 50 పాయింట్ల లాభంతో 15,769 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ కూడా అరశాతం లాభంతో ఉంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,084.50 2.90
బీపీసీఎల్ 438.50 1.52
ఐషర్ మోటార్స్ 2,876.20 1.21
ఓఎన్‌జీసీ 129.95 1.17
ఐటీసీ 218.35 1.09
నిఫ్టి టాప్ లూజర్స్
టైటాన్ 2,113.75 -0.29
హెచ్‌డీఎఫ్‌సీ 2,809.00 -0.23
దివీస్ ల్యాబ్ 5,148.35 -0.20
ఏషియన్ పెయింట్స్ 3,345.50 -0.20
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1,544.45 -0.15