నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
మళ్లీ ఉద్దీపన ప్యాకేజీ అమెరికా మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణకు సంబంధించి ఈ నెలలోనే ప్రకటన రావొచ్చు. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. చిత్రంగా క్రూడ్ కూడా పెరుగుతూనే ఉంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు 0.7 శాతంపైనే నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 1.7 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, ఇతర మార్కెట్లు నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. శుక్రవారం మార్కెట్‌కు సెలవు కారణంగా సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా నష్టాల్లోనే ప్రారంభం కావొచ్చు. కాని నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.