For Money

Business News

అయోమయంలో స్టాక్‌ మార్కెట్లు

ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతుందా? లేదా అన్న సంశయంలో స్టాక్‌ మార్కెట్లు కొట్టుమిట్టాడుతున్నాయి. భారీ నష్టాల తరవాత నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ చాలా వరకు లాభాలను కోల్పోయి 0.03 శాతం లాభంతో ముగిసింది. దాదాపు లాభాలన్నీ కోల్పోయింది. డౌజోన్స్‌ 0.49 శాతం నష్టంతో, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.38 శాతం నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే తీరు. చైనా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. లాభాలు కూడా అర శాతం లోపే. అయితే జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ వంటి కీలక మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కాకపోతే నష్టాలు నామమాత్రంగా ఉండటం ఉపశమనం కల్గించే అంశం. కరెన్సీ మార్కెట్‌ స్థిరంగా ఉన్నా.. క్రూడ్‌ మార్కెట్‌ భయపెడుతోంది. సింగపూర్‌ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి లాభాల్లో ప్రారంభం కానుందన్న మాట.