For Money

Business News

రూ.50,000 దాటేసింది

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, బులియన్‌ ధరలు పెరగడంతో దేశీయంగా పసిడితో పాటు వెండి పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఇవాళ పది గంటలకు మళ్ళీ లాభాల్లో ప్రారంభం కానుంది. రాత్రి ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ. 50,011ని తాకి రూ.49,950 వద్ద ముగిసింది. నిన్న ఒక్క రోజే పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ.836 పెరిగింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే బంగారం రూ. 50,000 దాటే అవకాశముంది. ఎందుకంటే ఆసియా మార్కెట్లలో బంగారం మరింత పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే రాత్రి కిలోవెండి (మార్చి కాంట్రాక్ట్‌) రూ.64,270 వద్ద ముగిసింది. నిన్న ఒక్కరోజే వెండి కూడా రూ.1,282 లాభపడింది. ఉదయం నుంచి వెండి కూడా ఆసియా మార్కెట్లలో పెరుగుతోంది.