For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆరంభంలో అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా… క్లోజింగ్‌ సమయానికి వచ్చేసరికల్లా నాస్‌డాక్‌లో అమ్మకాలు జోరుగా సాగాయి. నాస్‌డాక్‌ రాత్రి అర శాతం నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ నామమాత్రపు లాభంతో క్లోజ్‌ కాగా, డౌజోన్స్‌ మాత్రం అర శాతంపైగా లాభంతో ముగిసింది. అమెరికా మార్కెట్లను బాండ్‌ ఈల్డ్స్‌ భయపెడుతున్నాయి. డాలర్‌ భారీగా పెరుగుతోంది. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ముందుగా పెంచే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు మార్కెట్‌ను హడలెత్తిస్తున్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కన్పిస్తోంది. ఉదయం నుంచి ఆన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఏకంగా ఒక శాతం నష్టంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ వరుసగా నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఇవాళ చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నా… నామ మాత్రంగా ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి 60 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.