For Money

Business News

భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఒమైక్రాన్‌ భయాలు క్రమంగా మార్కెట్‌ను కమ్మేస్తున్నారు. ఆరంభంలో పెద్ద ప్రమాదకరం కాదంటూ తోసిపుచ్చిన వైద్య నిపుణులు కొత్త పల్లవి అందుకున్నారు.దీంతో మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సాధారణ ట్రెండ్‌కు భిన్నంగా ఐటీ షేర్లు నిలకడగా ఉండగా, డౌజోన్స్‌ భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ ఏకంగా రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనాతో పాటు హాంగ్సెంగ్‌ కూడా నష్టాల్లో ఉంది. సింగపూర్ నిఫ్టి దాదాపు వంద పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టాలతో ప్రారంభం కానుంది.