For Money

Business News

24×7 ఇంటి వద్దకే బిస్లెరీ వాటర్‌

ప్యాకేజ్డ్‌ వాటర్‌ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్‌ ఇపుడు ఇంటి వద్దకే నీటి క్యాన్‌ను సరఫరా చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. Bisleri@ Doorstep అనే మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ సహాయంతో కస్టమర్ల ఇంటికి నేరుగా వాటర్‌ క్యాన్‌ను డెలివరీ చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో బిస్లెరీ డోర్‌ డెలివరీ సేవలను అందిస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ,నొయిడా, గురుగ్రామ్‌, అహ్మాదాబాద్‌, చెన్నై తదితర నగరాల్లో అందుబాటులో ఉంది. బిస్లెరీ మినరల్‌ వాటర్‌ను నిరంతరాయంగా సరఫరా పొందడం కోసం కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.