For Money

Business News

NIFTY LEVELS: పెరిగితే అమ్మండి

చాలా మంది అనలిస్టులు నిఫ్టి పెరిగితే అమ్మమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 15832. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 15800 స్థాయిని కోల్పోనుంది. మరి నిఫ్టికి తొలి మద్దతు 15753 ప్రాంతంలో వస్తుందా అనేది చూడాలి. నిఫ్టి తరువాతి మద్దతు స్థాయిలో కోలుకునే అవకాశముంది. మార్కెట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్వల్పకాలానికి నిఫ్టిని 15700 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని కొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు పొజిషనల్‌ పుట్‌ ఆప్షన్స్‌ కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు.
నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 15974
రెండో ప్రతిఘటన – 15936
తొలి ప్రతిఘటన – 15911
నిఫ్టికి కీలకం – 15820
తొలి మద్దతు – 15753
రెండో మద్దతు – 15728
డౌన్‌ బ్రేకౌట్‌ – 15691