For Money

Business News

17300 దిగువన నిఫ్టి…

నిఫ్టి ఒకదశలో 17225 వద్దకు చేరినా.. క్రమంగా కోలుకుని ఇపుడు 17275 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ఉంది. నిన్న భారీగా పెరిగిన ఆటో, మెటల్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించగా, ఐటీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. నిఫ్టి టాప్‌ 5లో నాలుగు ఐటీ షేర్లు ఉండటం విశేషం. టీసీఎస్‌ 1.5 శాతం లాభంతో టాప్‌లో ఉంది. జొమాటొ 10 శాతం క్షీణించినా.. ఇపుడు కోలుకుని 3 శాతం లాభంతో ఉంది. ఇక పేటీఎం ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌ గెయినర్‌. ఇవాళ ఈ షేర్‌ 3.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నెక్ట్స్‌ ఒక శాతం నష్టపోగా, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. కాంకర్‌, అరబిందో ఫార్మా, భారత్‌ ఫోర్జ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్లు 3 శాతం నుంచి 4.5 శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. యూరోపియన్‌ షేర్లు నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నాయి. పెద్దగా లాభనష్టాలు లేవు. మిశ్రమంగా ఉన్నాయి. యూరో స్టాక్స్‌50 సూచీ 0.10 శాతం లాభంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో… నిఫ్టి కూడా గ్రీన్‌లో ముగుస్తుందేమో చూడాలి. క్రూడ్‌ మళ్ళీ వంద డాలర్ల లోపు అంటే 99 డాలర్లకు పడిపోవడం మన మార్కెట్లకు ప్లస్‌.