For Money

Business News

నష్టాల్లో నిఫ్టి

యూరోపియన్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా మార్కట్లు స్థిరంగా ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టిపై ఒత్తిడి కన్పిస్తోంది. ఉదయం ఆరంభంలో 17490ని తాకిన నిఫ్టి యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు 17161 పాయింట్లకు క్షీణించింది. అంటే 300 పాయింట్లకు పైగా క్షీణించింది. తరవాత కోలుకుని ఇపుడు 17324 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 64 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దిగువ స్థాయిలో నిఫ్టికి గట్టి మద్దతు లభించడంతో వెంటనే కోలుకుంది. అయితే తైవాన్‌పై చైనా దళాలు దాడులు చేశాయని వార్తలు వస్తున్నాయి. పైగా వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టి గ్రీన్‌లోకి వస్తుందా లేదా నష్టాల్లో ముగుస్తుందా అన్నది చూడాలి.