For Money

Business News

17500 చేరువలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17490ని తాకింది. ఇపుడు 17475 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 87 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. నిన్న ఒక శాతం క్షీణించిన నిఫ్టి మిడ్‌ క్యాప్‌ ఇవాళ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక నిఫ్టి నెక్ట్స్‌ 0.63 శాతం లాభంతో ఉంది. ఇక నిఫ్టి బ్యాంక్‌ సూచీ కూడా ఇదే స్థాయి లాభంతో ఉంది. ఇవాళ కూడా ఐటీ షేర్ల హవా కొనసాగుతోంది. ఐటీ షేర్‌ ఇండెక్స్‌ 1.6 శాతం లాభంతో ఉంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో భారీ యాక్టివిటీ కన్పిస్తోంది. ఇవాళ నిఫ్టి గెయినర్స్‌ హిందాల్కో టాప్‌లో ఉంది. తరవాతి స్థాయిలో ఇన్ఫోసిస్‌, శ్రీసిమెంట్‌, విప్రో, టాటా మోటార్స్‌ ఉన్నాయి. టాటా కన్జూమర్‌ లూజర్స్‌లో టాప్‌లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ సూచీలో పీఐ ఇండస్ట్రీస్ ఇవాళ కూడా 4 శాతంపైగా లాభపడింది. ఈ షేర్‌ ఇప్పటి వరకు 5000 శాతంపైగా పెరిగింది. జొమాటొ ఇవాళ 1.5 శాతం లాభంతో రూ. 56.30 వద్ద ట్రేడవుతోంది. పే టీఎం ఇవాళ కూడా రూ. 13 పెరిగి రూ. 817 వద్ద ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత ఎల్‌ఐసీ లాభాల్లో ఉంది.