For Money

Business News

కోలుకుంటున్న నిఫ్టి

ఉదయం హెచ్చరించినట్లే నిఫ్టికి ఏడు రోజుల తరవాత నిఫ్టిలో లాభాల స్వీకరణ వచ్చింది. దీంతో ఉదయం 17992 పాయింట్లను తాకిన నిఫ్టి 17,727 పాయింట్లకు పడిపోయింది. దాదాపు 280 పాయింట్లు క్షీణించిదన్నమాట. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 17,820 వవద్ద ట్రేడవుతోంది. ఇవాళ బ్యాంకుల నుంచి ఒత్తిడి అధికంగా వచ్చింది. ఉదయం అనలిస్టులు పేర్కొన్న షేర్లలో అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా ఇవాళ టాప్‌ గెయినర్స్‌లో ఉండటం విశేషం. ముఖ్యంగా అదానీ పోర్ట్స్ 5 శాతం దాకా లాభపడింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, అపోలో హాస్పిటల్స్‌ రెండు శాతం దాకా నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ షేర్లు భారీ లాభాలతో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌ 5 శాతం, అదానీ గ్రీన్‌ 6 శాతం, అదానీ గ్రూప్‌కే చెందిన అంబుజా సిమెంట్‌ 4 శాతం, అదానీ ట్రాన్స్‌ మిషన్‌, అదానీ విల్మర్‌ ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. టికెట్ కౌంటర్లను మూసివేయడం లేదని రైల్వే శాఖ వివరణ ఇచ్చినా.. ఐఆర్‌సీటీసీ షేర్‌ ఇవాళ మరో 5 శాతం పెరిగింది. జీ ఎంటర్‌టైన్మెంట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. షేర్‌ మరో మూడు శాతం పెరిగింది. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఉండటం, అమెరికా మార్కెట్ల నష్టాలు తగ్గే పక్షంలో… నిఫ్టి క్లోజింగ్‌కల్లా నష్టాలు తగ్గే అవకాశముంది.