For Money

Business News

నిఫ్టికి భారీ నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై బాగా కన్పించింది. వరుసగా ఏడు రోజులు లాభాల్లో ముగిసిన నిఫ్టి ఇవాళ భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం భారీగా క్షీణించినా.. కోలుకున్న నిఫ్టి.. తరవాత మళ్ళీ బలహీనపడింది. దీనికి ప్రధాన కారణంగా ఒక మోస్తరు నష్టాలతో ఉన్న యూరో మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ భారీగా నష్టపోవడమే. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.6 శాతంపైగా నష్టపోగా, అమెరికా ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌ 0.8 శాతం నష్టంతో ఉంది. పైగా డీజిల్‌ ఎగుమతులపై సుంకం పెంచడంతో రిలయన్స్‌ నష్టాలతో ముగిసింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ ఫిన్‌ షేర్లు మూడు నుంచి నాలుగు శాతం నష్టాలతో ముగిశాయి. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉండటం విశేషం. నిఫ్టి షేర్లలో అదానీ పోర్ట్స్‌ 4.44 శాతం లాభంతో ముగిసింది. ఎల్‌ అండ్‌ టీ 2 శాతం నష్టం లాభపడింది. నిఫ్టిలో ఆరు షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 44 షేర్లు నష్టాల్లో ముగిశాయి. కాస్త పరవాలేదనిపించిన ఎల్‌ఐసీ మళ్ళీ రూ.10 క్షీణించి రూ. 685కి చేరుకుంది. ఐఆర్‌సీటీసీ షేర్‌ రూ. 21 లాభంతో రూ. 735 వద్ద ముగిసింది. మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉండే బజాజ్‌ ఫైనాన్స్‌, డిక్షన్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.