For Money

Business News

17400 దిగువకు నిఫ్టి… అందిన మద్దతు

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17345ను తాకింది. 17400 దిగువన మద్దతు అందడంతో వెంటనే కోలుకుంది. ప్రస్తుతం 17491 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపు వద్దే ఇపుడు ట్రేడవుతోంది. 32 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో ఐషర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎంకు గట్టి మద్దతు లభించింది. ఇక ఐటీ షేర్లు నిఫ్టి బాగా దెబ్బతీశాయి. వేరియబుల్‌ పేలో ఇన్ఫోసిస్‌ కోత పెట్టినట్లు వార్తలు రావడంతో ఆ షేర్‌ ఇవాళ రెండు శాతం క్షీణించింది. ఇంకా టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇతర సూచీలు కూడా నష్టాల్లో ప్రారంభమై… కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టి నెక్ట్స్‌లో 3 శాతం లాభంతో గ్లాండ్‌ ఫార్మా టాప్‌లో ఉంది. నౌకరీ ఇవాళ కూడా మూడు శాతం క్షీణించింది. ఐటీ మిడ్‌ క్యాప్‌లో ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ కోలుకున్నా.. నిఫ్టి బ్యాంక్‌ మాత్రం నష్టాల్లో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్పంగా గ్రీన్లో ఉన్నాయి. మరి నిఫ్టిఈ స్థాయిని కాపాడుకుంటుందేమో చూడాలి.