For Money

Business News

18,000 దగ్గర్లో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి 17,977 వద్ద ప్రారంభమై 17990ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 85 పాయింట్ల లాభంతో నిఫ్టి ప్రస్తుతం 17,959 వద్ద ట్రేడవుతోంది. 18,000ని క్రాస్‌ చేస్తుందేమో చూడాలి. టాటా స్టీల్‌ నికర లాభం 8 రెట్లు పెరిగినా.. ఈ షేర్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. కంపెనీ ఫలితాలను మార్కెట్‌ ఊహించిందే. అయితే హిందాల్కో రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 44 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ అర శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా.. లాభాలు తక్కువే. మిడ్‌ క్యాప్స్‌లో ఐడియాకు మద్దతు కొనసాగుతోంది.