For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

వీక్లీ డెరివేటివ్స్‌ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో నిఫ్టి 17112ని తాకినా వెంటనే 17081ని తాకింది. ఇపుడు 31 పాయింట్ల నష్టంతో 17092 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టిలో 26 షేర్లు నష్టాల్లో 24 లాభాల్లో ఉన్నాయి. ఇతర సూచీల్లో నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ గ్రీన్‌లో ఉండగా, నిఫ్టి బ్యాంక్‌ అర శాతం నష్టంతో ఉంది. అలాగే ఫైనాన్షియల్స్‌ కూడా. ఊహించినట్లే విప్రో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఫలితాలు నిరాశకల్గించడంతో షేర్‌ అయిదు శాతం నష్టంతో ట్రేడవుతోంది. టీసీఎస్‌ కూడా నష్టాల్లో ఉంది. ఇక బ్యాంకుల నుంచి నిఫ్టిపై ఒత్తిడి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నాయి. నిన్నటి ఫలితాలు బాగుండటంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే హిందాల్కో, టాటా స్టీల్ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పోర్టుకు సంబంధించి కాంట్రాక్ట్‌ దక్కడంతో అదానీ పోర్ట్‌ కూడా గ్రీన్‌లో ఉంది. లారస్‌ ల్యాబ్‌, దీవీస్‌, గ్లాండ్‌ ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి.