For Money

Business News

అయ్యో… ఐటీ షేర్లు

కరోనా సమయంలో జెట్‌ స్పీడ్‌తో ఎగిసిన ఐటీ షేర్లలో కరెక్షన్‌ ఇంకా కొనసాగుతోంది. కరోనా సమయంలో అనేక షేర్లు రెట్టింపు అయ్యాయి. కరోనా తరవాత అమెరికాలో నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో అక్కడి కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా మార్కెట్‌లో నిధులు చెలామణి తగ్గిస్తోంది. దీంతో అనేక ఐటీ, టెక్‌ కంపెనీలు తమ బడ్జెట్‌ను తగ్గిస్తున్నారు. ఇతర కంపెనీలు కూడా కొత్త పెట్టబుడుల విషయమై జాగ్రత్త పడుతున్నాయి. దీంతో భారత కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు దక్కడ కష్ఠంగా మారింది. ఫలితంగా మన మార్కెట్‌లో ఐటీ కంపెనీలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టులు తగ్గడంతో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నా… సీనియర్లను వొదిలించుకుంటున్నాయి. ఈ అడ్జస్ట్‌మెంట్‌ నేపథ్యంలో కంపెనీలు కనీసం 5 శాతం వృద్ధి రేటు సాధించడం కూడా చాలా కష్టంగా మారింది. గత కొన్ని నెలల నుంచి మార్కెట్‌లోఇదే పరిస్థితి. నాస్‌డాక్‌ గరిష్ఠ స్థాయి నుంచి 33 శాతంపైగా క్షీణించింది. మన దగ్గర కూడా అనేక ప్రధాన బ్యాంకులు 30 శాతం దాకా క్షీణించాయి. రెండో త్రైమాసిక ఫలితాల తరవాత కూడా ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ఫలితాలు ప్రకటించిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో మార్కెట్‌ను సంతృప్తి పర్చలేకపోయాయియ.ఈ మూడు షేర్లు ఇపుడు 52 వారాల కనిష్ఠ స్థాయి దిగువకు వచ్చేశాయి. ఇతర షేర్లలో ఎంఫసిస్‌ది అదే పరిస్థితి. ఏకంగా ఐటీ నిఫ్టినే 52 వారాల కనిష్ఠ స్థాయి దిగువకు వచ్చేసింది. ఈ అనిశ్చితి ఎంత కాలమనే విషయంలో కూడా మార్కెట్‌లో స్పష్టత లేదు.