For Money

Business News

17,400పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టితో పోలిస్తే కాస్త తక్కువ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17400ని దాటి 17438ని తాకింది. ఇపుడు 17423 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 41 పాయింట్ల లాభంతో ముగిసింది. నిప్టిలో 41 షేర్లు లాభాల్లో ఉండగా, 9 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గత రెండు నెలల్లో బ్యాంకు, ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు దాదాపు పది శాతం నుంచి 20 శాతం పెరిగింది. ఇక ఐటీ కంపెనీల్లో కూడా ర్యాలీ కొనసాగుతోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో గట్టి ర్యాలీ కన్పిస్తోంది. అలాగే సూబెక్స్‌ లిమిటెడ్‌ ఇవాళ కూడా 10 శాతం లాభంతో రూ. 43.90కి చేరింది. ఈ షేర్‌ ఒక్కవారంలోనే 60 శాతంపైగా పెరిగింది. దివీస్‌ ల్యాబ్‌ నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌లో ఉంది. బర్జర్‌ పెయింట్స్‌ కూడా నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌ గెయినర్‌. నిఫ్టి మిడ్‌క్యాప్‌లో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ ఫలితాలు నిరాశపర్చాయి. షేర్‌ 4 శాతంపైగా నష్టంతో ఉన్నాయి.