For Money

Business News

17000పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17000పైన ప్రారంభమైంది. అయితే 17021ని తాకిన తరవాత ఇపుడు 16997 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 137 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 455 పాయింట్ల లాభంతో ఉంది. అన్ని ప్రధాన సూచీలు ఒక శాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 47 షేర్లు లాభాలతో ఉండగా, మూడు షేర్లు నష్టంతో ఉన్నాయి. క్రూడ్‌ ధరలు తగ్గడంతో పెరిగిన ఏషియన్‌ పెయింట్… ఇవాళ క్రూడ్‌ పెరగడంతో క్షీణించింది. సిప్లా, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ రేపు నిఫ్టిలో చేరనుంది. నిఫ్టి నెక్ట్స్‌లో సూచీ షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. బోనస్‌ షేర్ల ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పడంతో నైకా షేర్‌ 5 శాతం లాభంతో ఉంది. అదానీ గ్రూప్‌నకు చెందిన చాలా షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో 2 శాతం పైగా పెరిగి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా టాప్‌ గెయినర్‌గా నిలిచింది.