For Money

Business News

అధిక స్థాయిలో అమ్మండి

మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నపుడు.. అపుడపుడు ఇలాంటి మెరుపులు వస్తుంటాయని.. వీటిని అమ్మడానికి ఉపయోగించుకోవలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. ఇవాళ నిఫ్టి 150 పాయింట్ల లాభంతో ప్రారంభం కానుంది. అయితే ఈ స్థాయిలో కాకుండా.. నిఫ్టి మరింత పెరిగే వరకు ఆగాలని ఆయన సూచించారు. 17100- 17150 మధ్యలో నిఫ్టిని అమ్మాలని ఆయన సలహా ఇచ్చారు. ఇంట్రాడేలో అధిక స్థాయిలో అమ్మి లాభాలు స్వీకరించవచ్చని… రిస్క్‌ తీసుకుని ఇన్వెస్టర్లు పాక్షికంగా తమ షార్ట్‌ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అధిక స్థాయిలో మార్కెట్‌ నిలబడదని ఆయన పేర్కొన్నారు. ఇంట్రా డే కోసం ఆయన బర్జర్‌ పెయింట్స్‌ కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. మార్కెట్‌ అధిక స్థాయిలో హిందాల్కోను అమ్మాలని ఆయన సలహా ఇచ్చారు. భెల్‌ షేర్‌కు ఆయన బై రెకమెండేషన్‌ ఇచ్చారు.