For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా స్థిరంగా నిఫ్టి ప్రారంభమైంది. 15,849 వద్ద ప్రారంభమైనా.. వెంటనే కోలుకుని ఇపుడు 15,870 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి కేవలం 8 పాయింట్లు మాత్రమే క్షీణించింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి నిఫ్టి 15,900 దాకా వస్తుందేమో చూడండి. ఈ స్థాయిని దాటితే నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి కానుంది. 15,920 స్టాప్‌లాస్‌తో అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు. నిఫ్టి గనక 15,940 దాటితే మరింత లాభాలు పొందొచ్చు. అయితే అధిక స్థాయిలో కొనుగోలు చేయొద్దు. దిగువ స్థాయిలో మార్కెట్‌కు మద్దతు అందుతుందేమో చూడండి. లేకుంటే ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టెక్‌ మహీంద్రా 1,058.90 1.24
శ్రీ సిమెంట్‌ 27,837.75 1.06
అదానీ పోర్ట్స్‌ 725.40 0.74
టైటాన్‌ 1,737.90 0.62
బజాజ్‌ ఆటో 4,072.00 0.59

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 311.90 -1.64
ఓఎన్‌జీసీ 118.15 -1.46
హిందాల్కో 389.80 -0.98
హెచ్‌యూఎల్‌ 2,462.30 -0.78
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,871.40 -0.78