For Money

Business News

మార్కెట్లకు యూరో కిక్‌

నిన్న రెండు శాతం దాకా లాభాల్లో ముగిసిన యూరో మార్కెట్లు ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మెజారిటీ మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. యూరోస్టాక్స్‌ 50 సూచీ 1.69 శాతం లాభంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల నుంచి 0.36 శాతం లాభాల్లోకి రావడంతో మిడ్‌ సెషన్‌లో నిఫ్టి మరింత బలం చేకూరింది. ఉదయం 16063ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 16143 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 16129 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 140 పాయింట్లు లాభపడింది. వీక్లీ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టి మరి మరింత పెరుగుతుందా లేదా ఇక్కడ లాభాల స్వీకరణ వస్తుందా అనేది చూడాలి. నిఫ్టి గనుకు 16098పైన ముగిసే పక్షంలో … ర్యాలీ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక షేర్ల విషయానికొస్తే రిలయన్స్‌ ఇవాళ కూడా 0.97 శాతం నష్టంతో ఉంది. లేకుంటే నిఫ్టికి మరిన్న లాభాలు అందేవి. టైటన్‌ 5.7 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా ఉంది. ఉదయం నుంచి ఏయే షేర్లు లాభాలు గడించాయే.. అవన్నీ తమ లాభాలను కొనసాగిస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా 561 పాయింట్లకు ట్రెండ్‌ లైన్‌ పైకి వచ్చేసింది.