For Money

Business News

నేడు బోరిస్‌ రాజీనామా?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్షన్‌ ఇవాళ రాజీనామా చేస్తారని బీబీసీ పేర్కొంది. ఇప్పటి వరకు 54 మంది మంత్రులు రాజీనామా చేసినా… బోరిస్‌ ఇంకా రాజీనామా చేయలేదు. ఇవాళ ఆయన ఓ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. బోరిస్‌ రాజీనామా చేసినా.. సెప్టెంబర్‌ నెల వరకు ఆయనే ప్రధానిగా ఉండే అవకాశముంది. ఇవాళ ఉదయం నుంచి వరుసగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ప్రమోషన్‌ పొందిన మంత్రి జహవి కూడా ప్రధాని రాజీనామాను కోరడం విశేషం. ఇపుడు బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో ఎవరు ప్రధాని అవుతారనే చర్చ ప్రారంభమైంది.