For Money

Business News

16500 దిశగా నిఫ్టి?

నిఫ్టి అన్ని విధాలా చాలా బలహీనంగా కన్పిస్తోందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టికి 200 రోజుల చలన సగటు 16850 ప్రాంతంలో ఉందని.. ఈ స్థాయిని కోల్పోయితే నిఫ్టి మరింత భారీగా క్షీణిస్తుందని ఆయన అన్నారు. 17040, 16918, 16810 స్థాయిలను నిఫ్టి కోల్పోత 16500 స్థాయికి వెళ్ళడం చాలా సులభమని ఆయన అన్నారు. నిఫ్టిపుట్‌ రైటింగ్‌ 16800 తరవాత 16500 వద్ద అధికంగా ఉందని ఆయన అన్నారు. ఐటీ, ఫార్మా సెక్టార్లలో కాస్త ర్యాలీ కన్పించినా.. నిఫ్టిని ఆదుకోవడం కష్టమని ఆయన అన్నారు. నిఫ్టి 17150ని దాటే వరకు బలహీనంగా ఉంటుందని అన్నారు. డౌన్‌ట్రెండ్‌లో కూడా నిఫ్టి అపుడపుడు కాస్త పెరిగినా… నిలబడటం కష్టమని అన్నారు. నిఫ్టిని షార్ట్‌ చేసే ఇన్వెస్టర్లు కూడా ఎప్పటికపుడు నిఫ్టిని లెవల్స్‌ చూసి లాభాలు స్వీకరించాలని… మార్కెట్‌లో చాలా ఒడుదుడుకులు ఉంటాయని అన్నారు. రేపు మార్కెట్‌లో వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉన్నందున నిఫ్టి ఇరువైపులా కదలాడే అవకాశముందని ఆయన అన్నారు.