For Money

Business News

NIFTY TRADE: నిఫ్టిని కొనొచ్చా!

నిఫ్టి ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ప్రారంభం కానుంది. ఆగస్టు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సిరీస్‌ ఈ గురువారంతో ముగుస్తుంది. వీక్లీ డెరివేటివ్స్‌ కూడా. ఈ సమయంలో నిఫ్టి హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సాధారణ ఇన్వెస్టర్లు ముఖ్యంగా డే ట్రేడర్లు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. సింగపూర్ నిఫ్టి ట్రెండ్‌ను బట్టి చూస్తే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16,600ని తాటే అవకాశముంది. ఈ స్థాయిలో ఓపెనైనా వెంటనే లాభాల స్వీకరణ ఉండొచ్చు. అంటే నిఫ్టి 16,550-16,560 ప్రాంతానికి రావొచ్చు. ఇక్కడ నిఫ్టి నిలబడుతుందేమో చూడండి. నిలబడితే కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి మళ్ళీ 16,600ను దాటి 16,644ని కూడా తాకొచ్చు. కాని ప్రధాన ప్రతిఘటన 16,690 ప్రాంతంలో వచ్చే అవకాశముంది. మిడ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. యూరో మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల ట్రెండ్‌ను ఫాలో అయితే… నిఫ్టిలో ఒత్తిడి అనుమానమే. 16,690 వరకు వెళ్ళే అవకాశముంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి పడినపుడు16,540 లేదా 16,550 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఇవాళ అనుమానమేననిపిస్తోంది.