For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మడమే

సాధారణ ఇన్వెస్టర్లు ఇవాళ నిఫ్టిలో ట్రేడింగ్‌ చేయకపోవడం మంచిది. మంత్లి, వీక్లీ డెరివేటివ్స్‌కు ఇవాళ క్లోజింగ్‌ నిఫ్టి 17,700 ప్రాంతంలోనే క్లోజ్‌ అవుతుందని టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నారు. అయితే తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి నష్టాల్లో ఉన్నా…అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్లో ఉన్నాయి. పెరుగుతున్న డాలర్‌తో పాటు క్రూడ్‌ పెరగడం మన మార్కెట్లకు ప్రతికూలమే. ఇవాళ మార్కెట్‌ అంతర్జాతీయ ట్రెండ్లను పట్టించుకుంటుందా? లేదా రోల్‌ఓవర్స్‌ను బట్టి స్పందిస్తుందా అన్నది చూడాలి. నిఫ్టి క్రితం ముగింపు 17,711. సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే అంటే 50 పాయింట్ల నష్టంతో నిఫ్టి ప్రారంభమౌతుందా అన్నది చూడాలి. ఎందుకంటే నిఫ్టి ఇవాళ 17650 ప్రాంతంలోనే మద్దతు ఉంది. కాబట్టి నిఫ్టి ఈ స్థాయిలోనే కోలుకుంటుందా లేదా 17,620 ప్రాంతానికి వెళుతుందా అన్నది చూడాలి. ఈ రెండు స్థాయిల్లోనూ నిఫ్టికి గట్టి మద్దతు ఉంది. రిస్క్‌ స్థాయిని బట్టి కొనండి. అమెరికా ఫ్యూచర్స్‌తోపాటు యూరో కూడా గ్రీన్‌ ఉండే పక్షంలో నిఫ్టికి మద్దతు అందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 17600 దిగువన నిఫ్టిలో భారీ ఒత్తిడి ఉంటుంది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందితే 17,700 స్థాయిని దాటుతుందేమో చూడండి. దాటితే చాలా ఈజీగా 17,777 స్థాయికి చేరే అవకాశముంది.