For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

పెట్రోల్‌ ధరలు పెరగడంతోపాటు డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడుతోంది. అధిక స్థాయిలో నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతోంది. 18000 దాటిన వెంటనే నిఫ్టిలో లాభాల స్వీకరణ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా ట్రేడవుతున్న నిఫ్టి.. ఇవాళ కూడా అదే ట్రెండ్‌ చూపిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే సింగపూర్ నిఫ్టి దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇక టెక్నికల్‌గా నిఫ్టి చార్ట్‌లు ఏం చెబుతున్నాయో చూద్దాం. నిఫ్టి క్రితం ముగింపు 17,0945. నిఫ్టికి ఇదే కీలక స్థాయి. నిన్నటి ముగింపు స్థాయిని నిఫ్టి కోల్పోతే తొలి మద్దతు 17870, 17850 స్థాయిల్లో లభించే అవకాశముంది. ఈ రెండు స్థాయిలను కోల్పోతే 17800 ప్రాంతానికి చేరొచ్చు. క్రితం ముగింపు స్థాయిని అధిగమిస్తే.. నిఫ్టి 18000 స్థాయిని క్రాస్‌ చేసే అవకాశముంది. అదే జరిగితే నిఫ్టికి 18020-18040 మధ్య ఒత్తిడి వచ్చే అవకాశముంది. సో… నాలుగు స్థాయిలను గమనించి ట్రేడ్‌ చేయండి. చిన్న ఇన్వెస్టర్లు స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మండి. నిఫ్టి మీ అంచనా మేరకు పడకపోతే.. నష్టంతో బయటపడండి. దిగువ స్థాయిలో కొనుగోలు చేయొద్దు. నిఫ్టిపై క్లారిటీ లేకుంటే ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.