For Money

Business News

ఏపీలో కోతలు షురూ

ఏపీలో విద్యుత్ సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోంది. స్పాట్‌ మార్కెట్‌లో కరెంటు కొనుగోలు చేసేందుకు నిధులు సమస్య ఉండటంతో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌ రూ.12 నుంచి రూ.14 ఉంటోందని తెలుస్తోంది. బొగ్గు సరఫరా మెరుపడి.. విద్యుత్‌ ఉత్పత్తి గాడిలో పడేంత వరకు కోతలు విధించడమే నయమని అధికారులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇక తదుపరి టార్గెట్‌ రాయలసీమ జిల్లాల్లో ఉండే అవకాశముంది. రాయలసీమలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. తొలుత గ్రామాల్లో విద్యుత్‌ కోత అమలు చేస్తారని తెలుస్తోంది.