For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల హోరు కన్పిస్తోంది. సింగపూర్ నిఫ్టి మాత్రం 50 పాయింట్ల నష్టం చూపిస్తోంది. నిఫ్టి గనుక ఈ స్థాయిలో ఓపెనైతే.. కాస్సేపు ఆగండి. ఇక్కడి నుంచి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించండి. నిఫ్టి క్రితం ముగింపు 17,248. కొత్త వీక్లీ డెరివేటివ్స్‌ సెషన్‌ ప్రారంభం అవుతుంది కాబట్టి… ఇక్కడి నుంచి నిఫ్టి పెరిగితే 17270 దాకా వెళ్ళొచ్చు. పొరపాటున 17300 దాటితే వెంటనే 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిన్న భారీగా పెరిగిన యూరో మార్కెట్లు ఇవాళ చల్లబడే అవకాశముంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు క్రితం ముగింపు స్థాయి వద్ద కూడా అమ్మొచ్చు. నిఫ్టి ఇవాళ కచ్చితంగా 17,180 దిగువకు వస్తుంది. ఈ స్థాయి కోల్పోతే 17,125కి రావడం ఖాయం. ఈ స్థాయిని కూడా కోల్పోతే మాత్రం నిఫ్టి 17,025 దాకా మద్దతు లేదు. మొత్తానికి నిఫ్టి కచ్చితంగా 100 రోజుల చలన సగటును కోల్పోవడం ఖాయంగా కన్పిస్తోంది. వీలైతే అధిక స్థాయిలో అమ్మండి. కొనుగోళ్ళు మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్‌ చేయండి.