For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

ఫెడ్‌ నిర్ణయం తాలూకు ఉత్సాహం కరిగి పోయింది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. డౌజోన్స్‌ ఒక్కటే తప్పించుకుంది. ఐటీ, టెక్‌ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఎస్‌ అండ్ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు భారీగా క్షీణించాయి. పూర్తి ఐటీ కంపెనీలకే పరిమితమైన నాస్‌డాక్‌ ఏకంగా 2.5 శాతం నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌, హాంగ్‌కాంగ్‌ సూచీలు దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. చాలా రోజుల తరవాత చైనా మార్కెట్లలో కూడా పతనం కన్పిస్తోంది. సింగపూర్‌ నిఫ్టి కేవలం 40 పాయింట్ల నష్టం చూపుతోంది. నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది.