For Money

Business News

మెడ్‌ప్లస్‌ ఐపీఓకు స్పందన సూపర్‌

హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఐపీఓ ఇవాళ ముగిసింది. ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ 52.59 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. మార్కెట్‌ నుంచి రూ.1,398.3 కోట్లు సమీకరించేందుకు మెడ్‌ప్లస్‌ ఐపీఓ జారీ చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 111.89 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 5.23 రెట్లు, హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు 85.33 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. ఒక్కో షేరును రూ.780-796 ప్రైస్‌ బ్యాండ్‌లో జారీ చేశారు. ఈ ఇష్యూ 23వ తేదీన లిస్ట్‌ కానుంది. అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌ రూ. 1002 పలుకుతోంది.