For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి… కాని

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లకు సంబంధించి ఇటీవల ప్రవేశ పెట్టిన నిబంధనలపై బీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. దీంతో ఈ రంగాల షేర్లకు నిన్న మద్దతు లభించింది. పైగా నిఫ్టి ఇపుడు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి వచ్చినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి మళ్ళీ 16,200-16,360 మధ్య కదలాడే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 16,282, ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఇదే కీలక స్థాయి. ఈ స్థాయి నుంచి పెరిగితే తొలి ప్రతిఘటన 16,340 ప్రాంతంలో రావొచ్చు. 16,360 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చు. 16,360పైన నిఫ్టిని అమ్మొద్దు. నిఫ్టి పడినపుడు నిన్నటి క్రితం స్థాయి (16,280)వద్ద మద్దతు అందుతుందేమో చూడండి. లేకుంటే నిఫ్టి 16,220 ప్రాంతానికి చేరొచ్చు. 16,200 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి గనుక 16,200ని కోల్పోతే 16175 ప్రాంతానికి చేరొచ్చు. నిన్నటి కనిష్ఠ స్థాయి 16160కి రాకపోవచ్చు. వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్‌ కాబట్టి నిఫ్టి ఒడుదుడుకులు ఉండొచ్చు.