For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మడమే

మార్కెట్‌ ఇవాళ నిస్తేజంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముఖ్యంగా ఐటీ, టెక్‌ కంపెనీ షేర్లలో అమ్మకాల నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్‌లో ఐటీ షేర్లకు మద్దతు ఉండకపోవచ్చు. నిన్న చాలా వరకు బ్యాంక్‌, పీఎస్‌యూ సంస్థల ఆధారంగా నిఫ్టి పెరిగింది. మరి ఇవాళ ఏ రంగానికి చెందిన షేర్లను పెంచుతారో చూడాలి. విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం నిఫ్టి 17800 ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌లను భారీగా అమ్మినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డే ట్రేడర్స్‌కు లెవల్స్‌ ఇవి.

నిఫ్టికి కీలకం- 17740

తొలి ప్రతిఘటన 17880
రెండో ప్రతిఘటన 17910
అప్‌ బ్రేకౌట్‌ … 17850
తొలి మద్దతు…17720
రెండో మద్దతు… 17690
డౌన్‌ బ్రేకౌట్‌… 17650
ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టి చాలా వరకు ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా కదలాడుతుంది. కాబట్టి లెవల్స్‌ చూసి ట్రేడ్‌ చేయండి. నిఫ్టి ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉంది. టెక్నికల్‌ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి.