For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మడమే…కాని

విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ అమ్ముతున్నారు. నిన్న దేశీయ సంస్థలు రూ.547 నికర కొనుగోళ్ళు చేయగా, విదేశీ ఇన్వెస్టర్లు రూ. 589 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. గత కొన్ని రోజులుగా ఎఫ్‌ఐఐలు కొంటూ వస్తున్నారు. ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. శుక్రవారం వినాయక చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో నిఫ్టి అప్‌ట్రెండ్‌ కష్టంగా కన్పిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,377. ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఇదే కీలక స్థాయి. ఈ స్థాయి పైకి ఉన్నంత వరకు నిఫ్టిలో పెద్దగా అమ్మకాల ఒత్తిడి ఉండకపోవచ్చు. నిఫ్టి గనుక పెరిగితే 17400 దాటే వరకు ఆగండి. ఒకవేళ దాటితే 17,425 దాకా వెళ్ళొచ్చు. 17,435 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. సింగపూర్‌ నిఫ్టి బలహీనంగా ఉంది. ఒకవేళ నిఫ్టి క్షీణించే పక్షంలో అంటే నష్టాలతో ప్రారంభమయ్యే పక్షంలో 17,330 దాకా వస్తుందేమో చూడండి. వస్తే 17300 స్థాయికి కూడా వెళ్ళే అవకాశముంది. ఒకవేళ వస్తే 17,280 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ స్థాయికి దిగువకు వెళితే నిఫ్టి అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిఫ్టి భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం తక్కువగా ఉంది.