For Money

Business News

లాభాలన్నీ పాయే

మొత్తం లాభాలు పోయాయి. గరిష్ఠ స్థాయి నుంచి పోలిస్తే నిఫ్టి 215 పాయింట్లు నష్టపోయింది. ఉదయం అనలిస్టులు హెచ్చరించినట్లు నిఫ్టి సరిగ్గా 16000 దాటిన తరవాత ఒత్తిడికి లోనైంది. ఈ స్థాయిలో అమ్మకాలు రావడానికి కారణం యూరో మార్కెట్‌ అమ్మకాలు. ఉదయం 12.30 గంటలకు అంటే యూరో ఫ్యూచర్స్‌ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్‌లో అమ్మకాలు పెరిగాయి. అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతం లాభం నుంచి అరశాతం నష్టంలోకి రావడం, యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టపోవడంతో … నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది.ఉదయం 16025 పాయింట్లకు చేరిన నిఫ్టి తరవాత క్రమంగా నష్టపోతూ 15785కి పడింది. అంటే 240 పాయింట్లు నష్టపోయింది. చివరికి15810 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్లు నష్టపోయింది. డే ట్రేడర్స్‌కు ఇవాళ లాభాల పంటే. ఉదయం ఓపెనింగ్‌లో కొన్నవారికి… సరిగ్గా రెండో ప్రతిఘటన స్థాయి వద్ద షార్ట్‌ చేసినవారికి మంచి లాభాలు వచ్చాయి. మధ్యాహ్నం తరవాత శ్రీ సిమెంట్‌, పవర్‌ గిడ్‌ వంటి షేర్లు లాభాల్లోకి రాగా, ఉదయంఒక మోస్తరు నష్టాల్లో ఉన్న షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. అన్ని సూచీలు స్వల్ప నష్టాలతో క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం స్వల్పంగా గ్రీన్‌లో ముగిసింది. రిలయన్స్‌, హిందాల్కో వంటి షేర్లు గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి నష్టాలు చాలా వరకు తగ్గాయి.