For Money

Business News

LEVELS: 18000 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 18,157. గత రెండు రోజులుగా మార్కెట్‌కు దిగువ స్థాయిలో మద్దతు అందడం లేదు. ఇవాళ నిఫ్టి 18100 దిగువన ప్రారంభం కావొచ్చు. అలాగే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్. తొలిసారి నిఫ్టికి 18200 ప్రాంతంలో కాల్ రైటింగ్‌ కన్పిస్తోంది. అలాగే 18300లో కూడా. అయితే 18000 ప్రాంతంలో అత్యధికంగా పుట్‌ రైటింగ్‌ కన్పిస్తోంది. సో.. నిఫ్టి ఈ స్థాయిలో మద్దతు లభించవచ్చు. లేదా 17950 ప్రాంతంలో మద్దతు అందుతుందేమో చూడాలి. ఎందుకంటే మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చే వరకు చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శున్‌ సుఖాని అంటున్నారు. మార్కెట్‌ నిలదొక్కుకునేంత వరుకు వెయిట్‌ చేయమని అటున్నారు. నిఫ్టికి 18060, తరవాత 18010 స్థాయి వద్ద మద్దతు అందుతుందేమో చూడాలని డేటా అనలిస్ట్‌ వీరేందర్ కుమార్‌ అంటున్నారు. నిఫ్టికి గట్టి మద్దతు 17951 లేదా 17905 ప్రాంతంలో లభించవచ్చు. నిఫ్టి పెరిగితే 18161 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌లో బ్లాక్‌ డీల్‌ ఉన్నందున ఆ షేర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.