For Money

Business News

ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడి

ఊహించినట్లే మార్కెట్‌ 15700 దిగువన ప్రారంభమైంది. 15688 వద్ద ప్రారంభైన నిఫ్టికి 15,694 వద్దే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే ఇవాళ్టి మద్దతు స్థాయి 15,633కి తాకింది. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టి చాలా సులభంగా 15600ని బ్రేక్‌ చేసే అవకాశముంది. ధైర్యం చేయగలిగే ఇన్వెస్టర్లు 15600-15620 ప్రాంతంలో స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. 15600 దిగువకు చేరితే ట్రేడింగ్‌కు 15,500 వరకు నిఫ్టికి మద్దతు లేదు. నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మినవారు ఈ స్థాయిలో లాభాలు స్వీకరించవచ్చు. దిగువ స్థాయిలో కొనుగోలు చేసే వారు స్వల్ప లాభాలతో బయటపడండి. లేదా ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,492.25 0.93
JSW స్టీల్‌ 673.65 0.81
టాటా స్టీల్‌ 1,197.70 0.67
హిందాల్కో 385.30 0.57
దివీస్‌ ల్యాబ్‌ 4,533.30 0.51

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,029.65 -1.51
యాక్సిస్‌ బ్యాంక్‌ 744.80 -1.27
ఎం అండ్‌ ఎం 767.90 -1.08
ఐసీఐసీఐ బ్యాంక్‌ 635.70 -0.97
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,505.80 -0.96