For Money

Business News

నిఫ్టి: డే ట్రేడర్లకు పండగ

నిఫ్టి ఆద్యంతం తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఆరంభం నుంచి పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు నిఫ్టి పరిమితం కావడంతో డే ట్రేడర్లు ఇవాళ భారీగా లాభపడ్డారు. యూరో మార్కెట్లు కోలుకోవడంతో నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత పడినా.. కోలుకుంది. ఉదయం సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా కాస్త తక్కువ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… కొన్ని నిమిషాల్లోనే ఇవాళ్టి కనష్ఠ స్థాయి 15,632ని తాకింది. ఆల్గో ట్రేడింగ్‌లో ఇదే మొదటి ప్రధాన మద్దతు స్థాయి.. అక్కడి నుంచి కేవలం గంటలో నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 15,730ని తాకింది. అంటే వంద పాయింట్లు లాభపడిందన్నమాట. నిఫ్టి దాదాపు గ్రీన్‌లోకి వచ్చి రాగానే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో మళ్ళీ భారీగా క్షీణించింది. కాని యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండేసరికి కోలుకుంది.నిన్న రెండు శాతంపైగా క్షీణించిన యూరో మార్కెట్లు ఇవాళ ఒక శాతంపైగా లాభపడ్డాయి. దీంతో పడినపుడల్లా నిఫ్టికి దిగువన మద్దతు లభిస్తూనే వచ్చింది. అలా 2.30 గంటలకు మరోసారి మద్దతు లభించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 38 పాయింట్ల నష్టంతో 15,689 పాయింట్ల వద్ద అంటే కీలక మద్దతు స్థాయి 15,700 దిగువనే క్లోజైంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లోకి రావడంతో నిఫ్టి చాలా వరకు నష్టాలను తగ్గించుకుంది. వెరశి ఇవాళ డే ట్రేడర్స్‌కు లాభాల పంట పండింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ముగిసింది. ప్రధాన సూచీలకు భిన్నంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 0.8 శాతం లాభంతో ముగియడం విశేషం.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా స్టీల్‌ 1,239.75 4.20 బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 12,775.15 3.58
అదానీ పోర్ట్స్‌ 728.00 2.29
భారతీ ఎయిర్‌టెల్‌ 536.50 2.13
దివీస్‌ ల్యాబ్‌ 4,605.00 2.10

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 3,998.95 -1.92 టీసీఎస్‌ 3,211.80 -1.43
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,504.40 -1.06
రిలయన్స్‌ 2,071.95 -0.99
యాక్సిస్‌ బ్యాంక్‌ 747.35 -0.93