For Money

Business News

మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ప్రారంభం

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16100 ప్రాంతానికి వెళ్ళింది. 16103ని తాకిన తరవాత 16127 వద్ద ఇపుడు ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మెటల్స్‌, ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. రిలయన్స్‌ షేర్లు నిద్రపోతుంటూ… అదానీ గ్రూప్ షేర్లు నిన్న.. ఇవాళ కూడా దూసుకుపోతున్నాయి. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర సూచీలు కూడా డల్‌గా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి 79.5ని దాటింది. టాప్‌ గెయినర్స్‌లో అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, టీసీఎస్‌ ఉన్నాయి. దాదాపు అన్ని నామ మాత్రపు లాభాలే. ఇక నష్టాల్లో హిందాల్కో ముందుంది.ఈ షేర్‌ నాలుగు శాతం నష్టపోయింది. జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. మార్కెట్‌ ప్రస్తుత స్థాయిలో నిలకడగా ఉంటుందని… 16050 స్టాప్లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.