For Money

Business News

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త చరిత్ర

ఆటో, బ్యాంకింగ్, రిలయన్స్‌ షేర్ల అండతో నిఫ్టి ఇవాళ 18,000 మార్క్‌ను దాటింది. టీసీఎస్‌ ఫలితాలు తరవాత ఐటీ షేర్ల భారీ నష్టం నేపథ్యంలో కూడా నిఫ్టి కొత్త ఆల్‌టైమ్‌ హైని తాకింది. చిత్రం మార్కెట్‌లో ఆటో, బ్యాంకింగ్‌ షేర్లు ఇవాళ ఎందుకు పెరిగాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆరంభంలో నష్టాల్లో ఉన్న నిఫ్టి క్రమంగా 160 పాయింట్లు కోలుకుని 18000 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 117 పాయింట్ల లాభంతో 18,012 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూపీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతంపైగా వృద్ధి రేటు సాగినపుడు స్టాక్‌ మార్కెట్‌ పడకేసింది. ఇపుడు ఎన్‌డీఏ హయాంలో వృద్ధి ఘోరంగా దెబ్బతింది. కాని స్టాక్‌ మార్కెట్‌ పరుగులు తీస్తోంది.గతంలో నిఫ్టి 1000 పాయింట్ల పరిగేందుక కొన్ని నెలలు పట్టేవి. 2020 మార్చి నుంచి 7511 పాయింట్ల నుంచి నిఫ్టి 140 శాతం పైగా పెరిగి 18,000 పాయింట్లు పెరిగింది. దేశంలో విద్యుత్‌ కొరత రానుందనే వార్తలతో బొగ్గు, విద్యుత్‌ తయారీ కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి.

(Photo courtesy: CNBC TV18)