For Money

Business News

ఆల్‌టైమ్‌ హైకి బ్యాంక్‌ నిఫ్టి

బహుశా బోనస్‌ డబ్బుల మహత్యమేమో! ప్రపంచ మార్కెట్లు చాలా నీరసంగా ఉన్నాయి. కాని మన దగ్గర మాత్రం సూచీలు భారీగా పెంచుతున్నారు. నిఫ్టి ఇప్పటికే 18000 దాటి 18,024 వద్ద ట్రేడవుతుంటే, బ్యాంక్‌నిఫ్టి కూడా 38374కు చేరి ఆల్‌టైమ్‌ హైని తాకింది. నిఫ్టిలో 41 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు వారం రోజులు భారీగా నష్టపోయిన జపాన్‌, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు పెరిగితే.. మన మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అనేక రాష్ట్రాలు అపుడే విద్యుత్‌ కోత మొదలు పెట్టాయి అనధికారికంగా. మరోవైపు ఐటీ ఫలితాలు డల్‌గా ఉన్నాయి. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్‌ డల్‌గా ఉంది.అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నెగిటివ్‌లో ఉంది. కాని మన మార్కెట్‌ పరుగులు పెడుతోంది. విద్యుత్ సంక్షోభం తరుముకు వస్తున్న తరుణంలో ఈ అప్‌ ట్రెండ్‌ దేనికి సంకేతం. కొన్ని రోజులు ఆగితే కాని తెలియదు.