For Money

Business News

17,700పైన నిఫ్టి

నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17719ని తాకిన నిఫ్టి ఇపుడు 17703 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 168 పాయింట్లు పెరిగింది. నిఫ్టిలో 48 షేర్లు పెరిగాయంటే మార్కెట్‌ మూడ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్‌, హిందాల్కో షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇవి కూడా ఏ క్షణమైనా లాభాల్లోకి వచ్చే అవకాశముంది. లాభాలు పొందిన షేర్లలో ఐటీ కౌంటర్లు ముందున్నాయి. నిఫ్టి వరకు తీసుకుంటే టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, విప్రో, ఇండస్‌ ఇండ్‌ టాప్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి నెక్ట్స్‌ విషయానికొస్తే ఎల్‌ అండ్‌ టీ ఐ, మైండ్‌ ట్రీ ముందున్నాయి. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌ విషయానికొస్తే పర్సిస్టెంట్‌, ఆస్ట్రాల్‌, ఎంఫీసిస్‌ టాప్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి బ్యాంక్‌ విషయానికొస్తే ఏయూ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌లో ఉన్నాయి. ఇక స్థానిక విషయానికొస్తే రెయిబ్‌బో హాస్పిటల్‌ ఇవాళ కూడా స్వల్పంగా లాభపడి రూ. 538 వద్ద ట్రేడవుతోంది. దివీస్‌ ల్యాబ్‌ స్థిరంగా ఉంది. నిన్న పది శాతంపైగా క్షీణించిన నాట్కో ఫార్మా షేర్లు స్వల్పంగా గ్రీన్‌లో ఉంది. నిన్న భారీగా క్షీణించిన బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ ఒక శాతంపైగా లాభపడింది.అలాగే పే టీఎం షేర్‌ రూ.10 పెరిగింది. ఎల్‌ఐసీ షేర్‌ రోజూ స్వల్పంగా పెరుగుతోంది.