For Money

Business News

డెరివేటివ్స్‌ క్లోజింగ్‌: మళ్ళీ ఒత్తిడి

ఉదయం నిఫ్టి నష్టాలతో ప్రారంభమైనా… ఇన్వెస్టర్లు వీక్లీ పొజిషన్స్‌ క్లోజ్‌ చేసే సమయంలో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. దీంతో నిఫ్టి ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా 17695 పాయింట్లకు చేరింది. దాదాపు సాధారణ ఇన్వెస్టర్ల రోల్‌ ఓవర్స్‌ పూర్తయిన తరవాత నిఫ్టిలో మళ్ళీ కరెక్షన్‌ వచ్చింది. ఇదే సమయంలో యూరో మార్కెట్ల ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉండటంతో నిఫ్టి బలహీనపడటం ప్రారంభమైంది. ఇపుడు యూరో మార్కెట్లు ఒక శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి ఇపుడు 17555 వద్ద 203 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రెండు శాతంపైగా లాభంతో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇతర ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నా.. అతి తక్కువగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.16 శాతం నష్టంతో ఉంది. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టిపైనే అధిక ఒత్తిడి ఉంది. ఎన్‌డీటీవీ ఇవాళ కూడా 5 శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద ట్రేడవుతోంది. కంపెనీ షేర్‌ రూ. 495కు చేరడంతో మార్కెట్‌ వ్యాల్యుయేషన్‌ రూ. 3000 కోట్లు దాటడం విశేషం.