For Money

Business News

ఓపెనింగ్‌లోనే కుప్పకూలిన నిఫ్టి

ఉదయం అంచనా వేసిన చివరి స్థాయి 17690ని కూడా నిఫ్టి కూలిపోయింది. ఓపెనింగ్‌ స్థాయితో పోలిస్తే నిఫ్టి 190 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 192 పాయింట్ల నష్టంతో 17,664 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ భారీగా పెరగడం, వస్తన్న కంపెనీ ఫలితాలు ఆ మేరకు లేకపోవడంతో షేర్లలో లాభాల స్వీకరణ జోరుగా సాగుతోంది. ఇవాళ ఏకంగా 44 నిఫ్టి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల భారీగా పెరిగిన షేర్లు, ఫలితాలు దారుణంగా ఉన్న కంపెనీలలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లో 17,647 కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టి తదుపరి మద్దతు స్థాయి 17,614 ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టి చాలా సులభంగా 17500 దిగువకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి.