For Money

Business News

15 శాతం డౌన్‌…కొనేవారు లేరు

ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్ల ఏవిధంగా చేతులు కాల్చుకుంటారో చెప్పడానికి ఐఆర్‌సీటీ షేర్‌ ప్రత్యక్ష ఉదాహరణ.ఈ కంపెనీ లిస్టయిన తరవాత ఆరోగ్యకరమైన వృద్ధితో ముందుకు సాగింది. మార్కెట్‌తో పాటు పెరిగింది. అయితే ఈ కంపెనీలో మరో రైల్వే కంపెనీని కంపెనీని విలీనం చేయాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతే షేర్‌ జెట్ స్పీడుతో పెరిగింది. ఈ షేర్‌ దాదాపు రెట్టింపు అయితే. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి రైల్వే బోర్డు నో చెప్పింది. అంతే ఈ షేర్‌ ఐస్‌ ముక్కలా కరిగి పోయింది. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఈలోగా షేర్‌ ముఖ విలువ విభజించాలని కంపెనీ నిర్ణయించింది. విభజన నిన్న అమల్లోకి వచ్చింది. అంతే షేర్‌ ఒక్కసారిగా 15 శాతం పెరిగింది. చిత్రమేమిటంటే విభజన తరవాత షేర్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి రాలేదు. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అన్నది తెలియదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకోలేకపోయారు. మార్కెట్‌తో పరిచయం ఉన్నవారు ఫ్యూచర్స్‌ అమ్మారు. ఈలోగా మరో వార్త… ఐఆర్‌సీటీసీ వసూలు చేసే ఫీజులో 50 శాతం తనకు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదిన. అంతే ఈ షేర్‌ ఇవాళ 15 శాతం నష్టంతో రూ. 776.50కి పడింది. ఒక్క ఎన్‌ఎస్‌ఈలో ఈ ధర వద్ద కూడా అమ్మడానికి కోటి పాతిక లక్షల షేర్లు ఉన్నాయి. అంటే మరో అయిదు శాతం పడటం ఖాయం. ఇవాళ ఇన్వెస్టర్ల ఖాతాల్లో విభజన షేర్లు కన్పిస్తున్నాయి. ఏం చేయాలి? ఈ షేర్‌లో లాభనష్టాలకు పూర్తి ప్రభుత్వం నిర్ణయాలనే కారణం కావడం విశేషం. మరి ప్రభుత్వ నిర్ణయాలు ముందే తెలిసిన పెద్దలు ఎన్ని వేల కోట్లు వెనుకేసుకున్నారో?అందుకే మార్కెట్‌లో విశేష అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ షేర్లకు చాలా దూరంగా ఉంటారు.