కుప్పకూలిన నిఫ్టి
మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గిఫ్ట్ నిఫ్టి సూచించిన దానికన్నా అధిక నష్టంతో నిఫ్టి మొదలైంది. ఆరంభంలోనే సోమవారం నాటి కనిష్ఠస్థాయి 22,283ని బ్రేక్ చేసింది. ఒకదశలో 22,209ని తాకింది. ఇపుడు 416 పాయింట్ల నష్టంతో 22275 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ 1380 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి షేర్లలో కేవలం ఒక్క హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే 0.21 శాతం లాభంతో ఉంది. మిగిలిన 49 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా ఇవాళ టాప్ లూజర్‌గా నిలిచింది. ఈ షేర్ ఇపుడు 4.55 శాతం నష్టంతో ఉంది. ఇంకా ఇండిగో, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌లో ముందున్నాయి. ఇవాళ మొత్తం 2588 షేర్లు ట్రేడవుతుండగా, 280 షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. ఏకంగా 2259 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
