For Money

Business News

భారీ నష్టాలతో గిఫ్ట్‌ నిఫ్టి

మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. నిన్నటి లాభాలు ఇవాళ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయే ఛాన్స్‌ ఉంది. ఇరాన్‌పై భీకర దాడి ఉంటుందని ట్రంప్‌ ప్రకటనతో మార్కెట్‌లో రివర్స్ సంకేతాలు వెలువడుతున్నాయి. యుద్ధం రెండు, మూడు వారాల్లో ముగుస్తుందని ఆశించిన ఇన్వెస్టర్ల ఆశలపై ట్రంప్‌ నీళ్ళు చల్లారు. ఒకదశలో 450 పాయింట్ల నష్టంలో ట్రేడైన గిఫ్ట్‌ నిఫ్టి ఇపుడు 325 పాయింట్ల నష్టంతో ఉంది. రేపు మార్కెట్లకు సెలవు కావడంతో ఇవాళ మార్కెట్‌పై ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా రేపు ప్రపంచ మార్కెట్లకు సెలవు. మళ్ళీ మార్కెట్‌ పనిచేసేది సోమవారమే. క్రూడ్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ ఇవాళే క్లోజ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే మూడు రోజుల్లో మార్కెట్‌లో ఏదైనా జరగొచ్చు.