For Money

Business News

17800 దగ్గర క్లోజైన నిఫ్టి

ఆర్బీఐ పరపతి విధానం చాలా నీరసంగా ఉంది. బ్యాంకు షేర్లు అంతంత మాత్రంగా స్పందించాయి. వాస్తవంగా పరపతి విధానం తరవాత మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంది. తరవాత యూరో మార్కెట్లు మన మార్కెట్లను బాగా ప్రభావితం చేశాయి. యూరో ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉండటంతో… నిఫ్టి పంజుకుంది. యూరో మార్కెట్లు ప్రారంభమవడమేగాక…దాదాపు ఒకటిన్నర శాతం లాభం ఆర్జించడంతో నిఫ్టి పుంజుకుంది. దిగువ స్థాయి 17600 నుంచి 17842 స్థాయికి చేరింది.చివరిదాకా అధిక స్థాయిలోనే కొనసాగింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 17784 పాయింట్ల ముగిసింది. సెన్సెక్స్‌ 412 పాయింట్లు పెరిగి 59447ని తాకింది. నిఫ్టి బ్యాంక్‌ 0.5 శాతం లాభపడగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.9 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 1.55 శాతం పెరిగింది. చోళా ఫైనాన్స్‌, అదానీ గ్రీన్‌ 8 శాతంపైగా లాభపడ్డాయి. ఐటీసీ 52 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.